నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని యంచ గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం నుండి శ్రీ కేదారేశ్వర ఆలయానికి ఉత్సవ విగ్రహాలను భాజా భజంత్రీలతో మంగళ హారతులతో జయ జయ నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లహరి ప్రవీణ్ కుమార్ మరియు గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.