మోమోస్‌ కేసులో ఆరుగురి అరెస్ట్‌

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వారాంతపు సంతలో మోమోస్‌ తిని ఓ మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌బస్తీలో మోమోస్‌ తయారు చేస్తున్న కేంద్రంలో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్‌ చేశారు. అనంతరం అక్కడ మోమోస్‌ తయారు చేస్తున్న అల్మాస్‌, సాజీద్‌ హుస్సేన్‌, రాయిస్‌, షారుక్‌, హనీఫ్‌, రాజిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.