డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆరుగురు పై కేసులు నమోదు

నవతెలంగాణ-  కమ్మర్ పల్లి

మండలంలోని ఉప్లూర్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాహనాలు దారులకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురు పై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై కన్న తల్లిదండ్రులకు కడుపుకోత తీసుకురావద్దని యువతకు ఆయన హితవు పలికారు.