– కాంగ్రెస్ శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు కొండకల్ జనార్థన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్‌పల్లి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ శంకరపల్లి మండల అధ్యక్షుడు కొండకల్ జనార్థన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళ వారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఇంటింటకీ తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోని బడుగు, బలహీన, వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరుగబెట్టింది ఏమీ లేదని ఆరోపించారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రామిన భీంభరతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, మండల మైనార్టీల అధ్యక్షులు మహబూబ్ హుస్సేన్, బలవంత రెడ్డి, మోహన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, సింగపురం సుధాకర్ రెడ్డి, నసిరుద్దీన్, శశికాంత్, ఎజాస్, తౌఫిక్,సర్తాజ్, బచ్చ గొల్ల శ్రీశైలం, సింగపురం రామచందర్, పల్లె శంకర్ పల్లి బద్దం కృష్ణారెడ్డి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.