ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

– తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం చేయాలి
– నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకెళ్లాలని హుస్నాబాద్  నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే తుక్కుగూడ బహిరంగ సభకు హుస్నాబాద్ నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభకు  ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే , సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయలని కోరారు. ఈ  కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, కంది తిరుపతిరెడ్డి, మంద ధర్మయ్య , మడత యాదవ రెడ్డి , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.