జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆరు’. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిం చారు. నిర్మాతలు బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ”కథ చాలా సరదాగా ఉంది. ఈస్ట్ గోదావరిలో వర్షంలో తీశాం. వర్షం కోసమే కోటిపైగా ఖర్చు పెట్టారు. రషెస్ చూశాను. సినిమా చూస్తే మనం నిజంగానే ఆ ఊర్లోకి వెళ్లి వర్షంలో తడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కథ ఓకే అయిన తరువాత ఎన్టీఆర్‌కి ఫోన్ చేశాం. ‘ఫస్ట్ డే వరకు మనం పుష్ చేస్తాం.. ఆ తరువాత సినిమా బాగుంటేనే ఆడుతుంది.. ఎవరి కష్టం వారిదే.. సినిమా కథ బాగుందని అంటున్నారు.. చేసేయండి’ అని ఎన్టీఆర్ అన్నారు. నితిన్ ఈ చిత్రంలో ఎంతో ఈజ్‌తో నటించాడు’ అని అన్నారు. ‘ఈ సినిమా చూస్తే కచ్చితంగా నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయి. ఆ గ్యారెంటీ మేం ఇస్తున్నాం’ అని నిర్మాత బన్నీ వాస్ చెప్పారు. దర్శకుడు అంజి కె.మణిపుత్ర మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు గోదావరి ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలన్నింటిల్లోకెల్లా ది బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్ నార్నే ఎంతో సహజంగా నటించారు. అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు. అజరు మంచి పాటలు ఇచ్చారు. బన్నీ వాస్ లేకపోతే ఈ చిత్రం లేదు’ అని తెలిపారు.