నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని తనకుర్ధి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర గత ఆరు నెలల నుండి ఐమాక్స్ లైట్స్ పాడైపోయి రాత్రి సమయంలో అటు సైడ్ నుండి వెళ్లాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడున్న ప్రజాప్రతినిదికి చాలా సార్లు గ్రామ ప్రజలు విన్నవించిన కూడా ఎటువంటి ప్రయోజనం జరగలేదు. తర్వాత వచ్చిన స్పెషల్ ఆఫీసర్ వినయ్ సహకారంతో గ్రామపంచాయతీ సెక్రటరీ ధీరజ్ ఏడు వేల రూపాయల ఖర్చుతో లైట్స్ పెట్టించి ప్రజా సమస్యను తీర్చాడు. కావున స్థానిక ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.