కల్తీ కల్లు తాగి ఆరుగురికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి ఆరుగురికి అస్వస్థత– ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ – వేములవాడ రూరల్‌
కల్తీ కల్లు తాగి ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం నూకలమర్రి గ్రామంలో మంగళవారం జరిగింది. అస్వస్థతకు గురైన సురేష్‌, ప్రకాష్‌, తిరుపతి, శ్రీనివాస్‌, రాజు, రాజును గ్రామస్తులు వేములవాడలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నాగేంద్రాచారి, రూరల్‌ ఎస్‌ఐ మారుతి ఆస్పత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.