ఆరవ తరగతి పరీక్షలు ప్రశాంతం

– మహబూబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు

నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాల పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపాడు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను సందర్శించి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను పరిష్కరించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ఆరవ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల్లో చిన్న విద్యార్థులు పాల్గొని రాయడం వారికి మంచిదని అన్నారు. రాబోయే రోజుల్లో రోజులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఈ పరీక్ష విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి పరీక్షలకు 116 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ఆదివారం నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ కు 91 మంది హాజరయ్యారని అన్నారు. 25 మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుండి పోటీ పరీక్షలో పాల్గొని వారి యొక్క ప్రతిభను వెలికి ఈస్ ఎందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ పోటీ పరీక్షలు ప్రతిభ కనబరిచిన వారి ఉన్నంత స్థాయికి ఎదగడానికి అవసరం పడుతుందని అన్నారు.  జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆరవ తరగతి అడ్మిషన్ల పరీక్ష ఉదయం 10 పాఠశాలలో నిర్వహించామని, మధ్యాహ్నం 10 పాఠశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వారు రాస్తున్న పరీక్ష విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది ఉన్నారు.