విజ్ఞాన భాండాగారం
విజ్ఞతకు సంస్కారానికి నిలయం
భవిష్యత్తుకు మార్గదర్శకం
పవిత్రతకు చక్కని స్థానం
సరస్వతి కొలువైన జ్ఞాననందనం
పుస్తకాల కొలువు గ్రంథాలయం
అక్షరక్షరం చెలిమితో జత కూడి
వాక్యాలుగా రూపుదిద్దుకుని
భావాలుగా పరిమళం వెదజల్లి
మనిషిని తీర్చిదిద్దే విజ్ఞానసుందరం
కథలుగా నీతిని వల్లిస్తూ
కవితలుగా వర్ణాన్ని వివరిస్తూ
పద్యాలుగా నీతిని నేర్పిస్తూ
రకరకాల పుస్తకాలతో నిండిన
మంచికి మార్గం చూపే నిర్దేశం
నేటి వార్తల సంగతులతో
ప్రపంచ జ్ఞానం నింపుతూ
జనరల్ నాలెడ్జ్ పుస్తకాలతో
మస్తిష్కానికి పదును పెడుతూ
జీవితాన్ని దిద్దుకునే మార్గాన్ని
అక్షరాలతో చూపే గ్రంథాలయం
నవలతో మనసును తేలిక పరుస్తూ
హాస్య కథలతో ఊర్రూతలూగిస్తూ
వివిధ భాషల సమతుల్యంతో
తులతూగే కమ్మని బందావనం
పాఠకుల మదిలో నిరంతరం
అక్షర కుసుమాలతో పరవశించే
జ్ఞాపకాలకు తరగని మహదానందం
పుస్తకాల నిధి గ్రంథాలయం
విజ్ఞతకు విజ్ఞానానికి మూల స్థానం
– నరెద్దుల రాజారెడ్డి,
9666016636