నవతెలంగాణ-తొగుట : తొగుట సర్కిల్ సిఐగా ఎస్.కె లతీఫ్ ఆదివారం బాధ్యత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. నిబంధనకు విరుద్ధంగా ఎవరైనా శాంతి పద్ధతులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పువు అన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైసె న్సు, బైక్ పై వెళ్లేవారు హెల్మెట్ ను తప్పనిసరిగా వాడాలని సూచించారు.