బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పించారు. ఈ సినిమా నేడు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ, ‘ఇందులో చాలా నియమాలు పాటించే అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్రలో మాస్, క్లాస్ రెండూ మిక్స్‌లో ఉంటాయి. వీటిల్లో కొన్ని సీన్స్ నా రియల్ లైఫ్ నుంచి కూడా వచ్చాయి (నవ్వుతూ). హీరో రామ్‌తో నటించడం మంచి అనుభవం. మా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్‌ని అద్భుతంగా చూపించడం బోయపాటి మార్క్. ఆ మార్క్‌లోనే రూపొందిన ఈ సినిమాని అందరూ ఎంజారు చేయవచ్చు’ అని తెలిపారు.