– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
సైన్స్ ఫెయిర్ నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సైంటిఫిక్ మెథడ్ అభివృద్ధి చెందుతుందని, దీంతో అన్ని రంగాలలో నైపుణ్యం పెరుగుతుందని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. సోమవారం పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కేరళ స్కూల్ లో ఈ విధమైన సైన్స్ ఫెయిర్ నిర్వహించడం అనేది చాలా గొప్ప కార్యక్రమo అన్నారు .ఇందులో దాదాపు 180 కి పైగా ప్రాజెక్టులు నిర్వహించడం జరిగిందని ,హార్ట్ సిస్టం గాని, వేస్ట్ మెటీరియల్ ఏ విధంగా ఉపయోగించుకోవాలని, సోలార్ సిస్టం ఇలా చాలా రకాల తెలుగు, హిందీ, మ్యాస్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్ కి సంబంధించినవి కంప్యూటర్కు సంబంధించినవి విద్యార్థిని ,విద్యార్థులు అందరూ చేసి చక్కగా వివరించడం పై అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆయిలేని అనిత రెడ్డి, వార్డు కౌన్సిలర్ పున్న లావణ్య సదనందం , ప్రిన్సిపాల్, పాఠశాల చైర్మన్ రాజేందర్ సెక్రటరీ, కరస్పాండెంట్ శైలేందర్ ,తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థుని, విద్యార్థులు పాల్గొన్నారు.