– పలు బడుల్లో సామూహిక అక్షరాభ్యాసం
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యావంతులు, పట్టభద్రులు అయిన ఉపాధ్యాయులు చే నైపుణ్య విధ్యాబోధన అందుబాటులో ఉందని కాంప్లెక్స్ హెచ్ ఎం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.హరిత అన్నారు. అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పలు పాఠశాలల్లో శుక్రవారం బడిబాటలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పరిధిలోని నందమూరి నగర్ ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఎన్‌ఓ ప్రసాద్ రావు, కాంప్లెక్సు ప్రధనోపాధ్యాయురాలు పి.హరిత పాల్గొన్నారు. అంగన్వాడీల నుండి 1వ తరగతిలో నూతనంగా చేరిన విద్యార్ధులకు ఉచితంగా పలక, బలపంలను పంపిణీ చేసి వారికి అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన జరుగుతుందని ఉన్నత విద్యావంతులుగా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్ధులతో మమేకమై ఆటపాటలతో బోధన చేపడుతున్నారని, దీంతో విద్యార్థికి సునాయాసంగా అర్ధం అవుతుందని అన్నారు. ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యా కోర్సులలో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల కే తొలి ప్రాధాన్యత కల్పిస్తారని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు అందరూ ఉన్నతస్థాయికి ఎదగాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు, సీఆర్‌పీ ప్రభాకరాచార్యులు, గ్రామస్తులు బలరాం తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ: విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ప్రాధమిక పాఠశాల పోకలగూడెంలో మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ నూతనంగా పాఠశాలలో 1వ తరగతిలో చేరిన విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేశారు. విద్యార్థులకు ఏకారుప దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, ఉత్తమ బోధనతో పాఠశాలను మండలంలోనే ఉత్తమ పాఠశాలగా ఉండాలన్నారు. మండల నోడల్ ఆఫీసర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ పట్ల, మధ్యాహ్నం భోజనంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయపు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మెన్ తులశమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవి పల్లి: బడిబాటలో భాగంగా మండలంలోని శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. హెచ్‌ఎం జ్యోతిరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలం నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ కొల్లు పద్మ, మాజీ వార్డ్ మెంబర్ వట్టి కొండ సాంబశివరావు విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండపనేని సతీష్, శ్రీనగర్ కాలనీ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, టీచర్ శౌరి ఇన్నయ్య, భవిత (దివ్యాంగుల కేంద్రం) టీచర్స్ జానకి పేరెంట్ టీచర్స్ శ్వేత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం: మండలంలోని కొత్తపల్లి ఏపీఎస్ పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా నూతనంగా పాఠశాలలో చేరినటువంటి విద్యార్థినీ, విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం కే.లక్ష్మణరావు, ఏపీఎస్ ప్రధానోపాధ్యాయులు సర్వేశ్వరరావు, ఉపాధ్యా యులు, లక్ష్మయ్య, బట్ట ప్రసాద్, ఆంజనేయులు, కళ్యాణి, అనసూయ, లక్పతి, సీఆర్‌టీలు ప్రసాద్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.