అంగన్వాడి కేంద్రంలోనే నైపుణ్యత గల విద్య..

Skilled Education at Anganwadi Centerనవతెలంగాణ – రెంజల్

చిన్నారులను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా అంగన్వాడి కేంద్రాల్లోని చేర్పించాలని అంగన్వాడి కేంద్రంలో నైపుణ్యత గల విద్య తోపాటు పౌష్టికాహారం లభిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి పేర్కొన్నారు. శనివారం రెంజల్ మండలం కూనే పల్లి గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు ఎత్తు బరువులు కొలసి వారికి పౌష్టికాహారాన్ని అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పిల్లల బరువులు తగ్గినట్లయితే వారికి ఆర్ బి ఎస్ కే ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం కల్పించారని ఆమె అన్నారు. గర్భిణీ బాలింత మహిళలకు పోషకాహారం పై అవగాహన కల్పించడమే కాకుండా తమ పెరట్లో ఆకుకూరలు కాయగూరలు పండించుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. అనంతరం కూనే పల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, గర్భిణీ భాలింత మహిళలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ ఎల్ ఎం ఎస్ సి సభ్యులు, ఐకెపి సభ్యులు పాల్గొన్నారు.