వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి స్కోడా కొత్త ఎస్‌యూవీ కారు

వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి స్కోడా కొత్త ఎస్‌యూవీ కారున్యూఢిల్లీ : వచ్చే ఏడాది ప్రథమార్థంలో భారత్‌లో తన కాంపాక్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్టు లగ్జరీ కార్ల తయారీ కంపెనీ స్కోడా ఆటో వెల్లడించింది. దీనికి వినియోగదారుల నుంచి పేరు ప్రతిపాదనలను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ఆ పేరు కచ్చితంగా కెతో ప్రారంభమై.. క్యూతో ముగియాలని సూచించింది. దీంతో భారత్‌లో 2026 నాటికి లక్ష యూనిట్ల అమ్మకాలను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగెన్‌ ఇండియా (ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్‌) ఎండీ, సీఈఓ పియూష్‌ అరోరా తెలిపారు.