
మండలంలోని జంగంపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నాయకమ్మ గుడికి స్లాబ్ పనులను కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు. అనంతరం సంఘం సభ్యులు వెంకటరమణారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఇన్చార్జ్ శ్రీధర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు రెడ్డి గారి రమేష్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పావని, ఉపాధ్యక్షురాలు ప్రమీల, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాజయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మున్నూరు కాపు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.