బ్యాడ్మింటన్ పోటీలకు స్లేట్ హై స్కూల్ విద్యార్థి ఎంపిక

Slate High School Student Selection for Badminton Competitionsనవతెలంగాణ – జన్నారం
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 మరియు అండర్ 17 విభాగంలో మంచిర్యాల జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సత్తా చాటిన స్లేట్ స్కూల్ విద్యార్థులుసత్ చాటారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని హైటెక్ సిటీ మంచిర్యాల క్లబ్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీలో స్లేట్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.అండర్ 17 బాలుర విభాగంలో రాధే శ్యామ్ మరియు అండర్ 14 బాలికల విభాగంలో శ్రీకృతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక అవడం జరిగింది.అలాగే జోనల్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కి అండర్ 17 బాలుర విభాగంలో రాధే శ్యామ్ ఎంపిక అవడం జరిగిందని స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ శ్రీ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు మరియు రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను స్లేట్ హై స్కూల్ డైరెక్టర్ ఏనుగు రజిత రెడ్డి ప్రిన్సిపాల్ శిరిన్ ఖాన్, పి.ఈ.టి లు సంతోష్, యం.నగేష్ , జ్యోష్న మరియు ఉపాధ్యాయులు అభినందించారు.