హైదరాబాద్ : ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా స్టేట్ లేవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తెలంగాణ మంగళవారం ‘2కె వాకథాన్’ను నిర్వహించింది. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉదయం 7 గంటలకు ఈ పరుగు సాగింది. ఇందులో ఆర్‌బీఐ, వివిధ బ్యాంక్‌లకు సంబంధించిన 400 మంది అధికారులు, ఉద్యోగులు సహా ఓయూ విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్‌బిఐ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కె నిఖిలా, ఎస్‌బీఐ హైదరాబాద్ సీజీఎం రాజేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై రన్నర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచార