మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన ఇంటర్ కాలేజ్ వాలీబాల్ సెలక్షన్స్ లో స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల విద్యార్థులు సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళ రాష్ట్రంలో జరుగు సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు కళాశాలకు చెందిన ఎం.సాయి తేజ, టి. మహేష్, మచ్చగిరి విద్యార్థులు ఎంపికయ్యారు. కళాశాల కార్యదర్శి డాక్టర్ టి. ఎన్.వంశ తిలక్ తమ చరవాణి సందేశంతో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. శ్రీనివాస్,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంజి రమేశ్ శిక్షణ అందించిన వ్యాయామ అధ్యాపకుడు బి. పాండురంగం కు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను కే.కిష్టయ్య, పి. బాల్ రెడ్డి, స్నేహలత, సుధ, డాక్టర్ బి.జగన్నాథ్, శివ ప్రసాద్, సిద్ది రాములు, సత్య నారాయణ, బాలరాజు, శశి కిరణ్, యాదగిరి, పవన్ కుమార్, శివ నాగేందర్ ప్రశంసించారు.