భువనగిరి పట్టణం హనుమాను వాడ లోని శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా కుక్కదూగ అశోక్ ను నియమిస్తూ, నియామక పత్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కమిటీ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్ గా నియమించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ , కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం తన శాయశక్తుల కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సేవా రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు, నాయకులు జంగిటి వినయ్, కమిటీ సభ్యులు కానుగంటి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.