ఉత్సాహంగా స్లాన్‌ కార్పోరేట్‌ చెస్‌

Sloan corporate chess with enthusiasm– విజేతలకు బహుమతులు ప్రదానం
హైదరాబాద్‌: స్లాన్‌ స్పోర్ట్స్‌, కె రహేజా మైండ్‌స్పేస్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్పోరేట్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. స్విస్‌ ఫార్మాట్‌లో జరిగిన చదరంగం పోటీల్లో 50 కంపెనీల నుంచి 150 మంది వరకు పోటీపడ్డారు. ఫణి కానూరి (కేర్లోన్‌) ఆరు పాయింట్లతో చాంపియన్‌గా నిలువగా.. ఐదు పాయింట్లతో అమర్‌నాథ్‌ కె (వెల్స్‌ ఫార్గో) రన్నరప్‌గా నిలిచాడు. వి సాయి కుమార్‌ (రియల్‌ పేజి), కార్తీక్‌ (ఏడీపీ) వరుసగా మూడు, నాల్గో స్థానాల్లో నిలిచారు. కార్పోరేట్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజేతలకు రెడ్‌ ఎఫ్‌ఎం ప్రతినిధి బద్రీనాథ్‌ బహుమతులు ప్రదానం చేశారు. స్లాన్‌ స్పోర్ట్స్‌ సీఓఓ నవీన్‌ నాయక్‌ సహా రహేజా మైండ్‌స్పేస్‌, మేరాహౌర్డింగ్స్‌ ప్రతినిధులు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.