– ఢిల్లీ సీఎంకు జైల్లో ప్రాణహాని :ఆప్‌మంత్రి సౌరభ్ భరద్వాజ్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జైల్లో స్లో పాయిజన్ ఇస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కేజ్రీవాల్ ఇన్సులిన్ స్థాయి నిరంతరం పెరుగుతోందని, అయితే అతనికి ఇన్సులిన్ డోస్ ఇవ్వడం లేదన్నారు. కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి’ అని ఆప్ నేత పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ”(అరవింద్ కేజ్రీవాల్) తన షుగర్ స్థాయి పెరుగుతోందని (జైలు) డాక్టర్‌తో పదేపదే చెబుతున్నారు. మీరు (జైలు పరిపాలన) నాకు ఇన్సులిన్ ఇవ్వండి, కాని (జైలు) వైద్యులు కేజ్రీవాల్ అబద్ధం చెబుతున్నారంటూ ఇన్సులిన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు.
అవయవ వైఫల్యం సంభవించవచ్చు!
.కేజ్రీవాల్ షుగర్ లెవెల్ రీడింగ్‌ను ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి సీఎం ఎక్స్-పోస్ట్‌లో పంచుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్ తగ్గుతోందనీ, ఇంత ఎక్కువ షుగర్ లెవెల్‌లో ఇన్సులిన్ ఇవ్వకపోతే ఆ వ్యక్తి క్రమంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు గురయ్యే అవకాశం ఉన్నదని ప్రస్తావించారు.