ఎస్‌ఎల్‌టీఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం (ఎస్‌ఎల్‌టీఏటీఎస్‌) 22వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్‌ ఎస్‌ఎల్‌టీఏ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషాపండితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు 2003, అక్టోబర్‌ 2న ఎస్‌ఎల్‌టీఏ ఆవిర్భవించిందని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ 19న భాషాపండితులకు పదోన్నతులు లభించాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు పొందకుండా మిగిలిన తెలుగు, హిందీ పండితులకు పదోన్నతులను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. భాషా సేవకు అంకితమై ప్రభుత్వానికి మంచిపేరు తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎల్‌టీఏటీఎస్‌ ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్‌, నాయకులు పెండ్యాల బ్రహ్మయ్య, జీవీవీ ప్రసాద్‌, అడ్లూరి వెంకటేశ్వర్లు, బషీర్‌, అనిల్‌, భాగ్యమ్మ, శ్రీహరి, దయాకర్‌, గౌస్‌పాషా, స్వామి, గుండు రవి, లింగమూర్తి, సురేంద్రనాథ్‌, వేణుమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.