గ్రామ గ్రామాన చిన్న బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ-శంకరపట్నం : శంకరపట్నం మండలంలో గ్రామ గ్రామాన చిన్న బతుకమ్మ సంబరాలను,శనివారం ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా ఆడపడుచులు ఉదయం నుండే బతుకమ్మలను పూలతో పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని చప్పట్లతో ఆటలడుతూ, కోలాటాలతో సవ్వడిలు చేస్తూ సంబరాలను జరుపుకున్నారు.