శివ నృత్యోత్సవ వేడుకలతో అబ్బురపరచిన స్మరాశిని

నవతెలంగాణ – ఆర్మూర్ 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని నందిపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన చిన్నారి స్మరాశిని శివ నృత్య ప్రతిభతో అందరిని అబ్బురపరిచింది. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి పాఠశాలలో చదువుకుంటున్న స్మరాశిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలోనూ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రముఖుల ప్రశంసలు పొందింది.