నిధులు మంజూరు పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఎంసి కమిటీ

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పెర్కిట్ మోడల్ పాఠశాల అభివృద్ధికై మంజూరైన నాలుగు లక్షల 71,000 నిజమేనని ఈ మొత్తం రూపాయలు పాఠశాల ఎస్ఎంసి దగ్గర ఉంచడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, ఎస్ఎంసి కమిటీ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపార. పాఠశాలకు మంజూరైన నిధులు దుర్వినియోగం చేసినట్టు మంగళవారం పత్రికలలో వచ్చిన మాట అవాస్తవమని తెలిపారు ఈ మొత్తం డబ్బుల నుండి మూడు లక్షల 50 వెయ్యిలు మొరంబాకి కట్టడం జరుగుతుందని, మిగిలినవి పాఠశాల మరమ్మతుకు ఎస్ఎంసి ద్వారా ఉపయోగించటం జరుగుతుందని తెలిపారు. నిధులు మంజూరుకు సహకరించిన జిల్లా కలెక్టర్ కు, ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కి, చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ కు స్థానిక కౌన్సిలర్ ఇట్టెడి నరసారెడ్డి లకు మోడల్ స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వారు అన్నారు.