పసిగట్టండి

ఎప్పట్లానే
మనం చెట్లకు నీళ్ళు పోస్తాం
వాళ్ళు ఫలాలు అందుకో చూస్తారు
ఫలాల రుచి నమిలి ఇలా అస్త్రాలు వదులుతున్నారు

ఆ మధ్య హిందుత్వమని నూరిపోసారు
నిన్న ఇండియా – భారత్‌ తెరపైకి తెచ్చారు
ఇవాళ సనాతనమంటూ వస్తున్నారు
రేపు ఇంకోటి…

దేశానికి దేశానికి మధ్య అంతరాలు తొలగి పోతుంటే
మనిషికి మనిషికి మధ్య అడ్డు వేస్తున్నారు

ఈ రోజుల్లో కళ్ళుంటే సరిపోదు అంధకారాన్ని చూడగలగాలి
చెవులు ఉంటే సరిపోదు నిశబ్దాన్ని వినగలగాలి
చూసిన దాన్ని, విన్నదాన్ని తర్కించి తెలుసుకోగాంగాలి
ఈ సనాతనం అసలు అర్థం గ్రహించగలగాలి

ఇప్పుడు
సందు సందులో సనాతనం గురించే మాట్లాడుకోవడం వాళ్ళుకు సరదా కావచ్చు
ఏ స్వలాభాపేక్ష లేనిదిగా సనాతనం నీకు కనిపించవచ్చు

అన్నట్లు
స్వాగతమో, తిరస్కరణో మనకంటూ పెగల్చుకునే గొంతుండాలి

పురజనులారా…
పడమటికి దూరం తక్కువ కదా
అడుగులు జాగ్రత్తగా వేయండి
– బొప్పెన వెంకటేష్‌, 9866584062