కంపు కొడుతున్న అండర్‌ డ్రెయినేజీ

నవతెలంగాణ -ఆలేరురూరల్‌
మండలంలోని సారాజిపేట జెడ్పీహెచ్‌ఎస్‌, ప్రాథమిక పాఠశాల మధ్యన రోడ్డు పక్కన అండర్‌ డ్రెయినేజీ నిండి ప్రవహిస్తూ కంపు కొడుతుందని కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కంతి నాగరాజు అన్నారు. గురువారం పాఠశాల సమీపంలో ఉన్న అండర్‌ డ్రెయినేజీ పరిశీలిస్తూ మాట్లాడుతూ 20 రోజులలో పాఠశాలలు తెరవడం జరుగుతుందన్నారు .ఇటీవల నిర్మించిన అండర్‌ డ్రెయినేజీ లీకవ్వడం పాఠశాల మైదానంలోకి వెళ్లడం బాధాకరమన్నారు. తొందరలోనే విద్యార్థులు పాఠశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు . చుట్టుపక్కల ఉండే ఇండ్ల ప్రజలు కూడా కంపు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు .ఈ కార్యక్రమంలో సిద్ధులు, వెంకటేష్‌, లాలు ప్రసాద్‌ ,సాయి కిరణ్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.