తీరిక
భిక్షగాడు : అమ్మా! కొద్దిగా అన్నం వేయండమ్మా.
ఇంటి యజమానురాలు : చేయి ఖాళీగా లేదు. మళ్లీ రా.
భిక్షగాడు : మరేం పర్వాలేదమ్మా. మీకేం ఇబ్బంది లేకుండా నేనే అన్నం పెట్టుకుని పోతాలే.
గౌరవం
మాస్టర్ : ఎవర్రా! నా ఫొటోకు బొట్టు పెట్టి దండ వేసి ధూపం వేసింది?
కొంటె విద్యార్థి : మీరే చెప్పారు కద మాష్టారూ… గురువులను గౌరవించాలని.
నగలు
రుషి : ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవాడిని. నాదగ్గరేముందని నాయనా ఇక్కడికి వచ్చావు?
దొంగ : తపస్సు చేస్తున్నావుగా! ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఆయన దగ్గరున్న బంగారు నగలని దోచుకుందామని!
వెతుకులాట
అజరు : కరాటే నేర్చుకున్నావు కదా! మరి మీ బంధువులను దొంగలొచ్చి కొడుతుంటే నువ్వేంటో వెతుకుతున్నావట. ఏంటి?
విజరు : నా కరాటే డ్రస్ కోసం వెతుకున్నా.
ప్రాక్టీసు
పేషెంట్ : డాక్టర్‌గారూ! కొత్తగా హాస్పటల్ పెట్టారుగదా.. మీరు ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎవరైనా చనిపోయారా?
డాక్టర్ : ముగ్గురిని చంపితే గానీ డాక్టర్ కోర్సు పూర్తికాదంటారు. ఇప్పటికి ఇద్దరు మాత్రమే చనిపోయారు. మరి మీ సంగతేంటో ఇప్పుడే చెప్పలేను.
మీరు కూడా
ఆఫీసర్ : ఆఫీసులో ఎవరు నిద్రపోయినా చెప్పమన్నానుగా. జూనియర్ అసిస్టెంట్ నిద్రపోయాడట కదా. మరి ఆ విషయం చెప్పలేదేం?
అటెండర్ : చెప్తామని వచ్చేసరికి మీరూ నిద్రపోతున్నారు సార్.
రాగం
సంగీత ప్రియుడు : నీకు ఏ రాగమంటే ఇష్టం?
నిద్రపోతు : కూనిరాగం.
మూగనోము
భార్య : ఏమండి మీ మేలుకోసం నేనో నోము చేద్దామనుకుంటున్నాను. ఏం చేయమంటారు?
భర్త : మూగనోము.
గొంతు నొప్పి
సరోజ : పెళ్లయిన మూడు రోజులకే మీ వారు ఎలా పోయారు?
సరళ : మొదటి రోజు కాళ్లు నొప్పంటే పట్టాను. రోండో రోజు నడుం నొప్పంటే పట్టాను. మూడో రోజు గొంతు నొప్పంటే పట్టాను. అంతే…
అర్ధం
సుబ్బారావు : ఒరేరు! ఇంగ్లీషులో యు ఆర్ ఏ ఫూల్ అంటే తెలుగులో అర్థం ఏంటో చెప్పరా?
అప్పారావు : నువ్వొట్టి వెధవ్వని అర్ధం.
సుబ్బారావు : అర్ధం చెప్పమంటే ఏంట్రా నన్నాలా తిడతావ్.
చిరునామా
వెంకయ్య : ఆస్ట్రేలియాకి నాకో ఉత్తరం రాసి పెట్టు.
సుబ్బయ్య : చిరునామా ఇవ్వు.
వెంకయ్య : చిరునామా తెలియకనే కదా నిన్ను రాయమంది.
బహుమతి
అనంత్ : పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరూ నీకు కావలసిన వాళ్లే కదా. మరి వాళ్ళకి ఏం కానుక ఇచ్చావు?
వెంకట్ : పెళ్ళికొడుక్కి కలర్ టీవీ, పెళ్ళికూతురికి రిమోట్ కంట్రోల్.