చురుకైన వాడు
రామయ్య : మీ పెద్దోడు ఏం చేస్తున్నాడు?
సోమయ్య : కలెక్టర్
రామయ్య : రెండో వాడు?
సోమయ్య : పోలీసాఫీసర్
రామయ్య : మూడో వాడు?
సోమయ్య : దొంగతనాలు
రామయ్య : ఇద్దరు అన్నయ్యలు గౌరవప్రదమైన వృత్తుల్లో ఉండగా చిన్నోడు దొంగతనాలు చేయడమేమిటి?’
సోమయ్య : వాడు దొంగతనాలు చేయబట్టే ఆ డబ్బుతో పెద్దోళ్లిద్దరు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించకోగలిగారు.
దూకలేడు.. ఎలా?
‘హలో… మా ఆయన కిటికీ లోంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు’ హోటల్ గది నుంచి రిసెప్షన్‌కు ఫోన్ చేసింది ఓ మహిళ.
‘కంగారుపడకండి మేడమ్! మీ ఆయన ఆ అఘాయిత్యం చేసుకోకుండా మేం కాపాడుతాం’ భరోసా ఇచ్చాడు రిసెప్షనిస్ట్.
‘నేను నీకు ఫోన్ చేసింది కాపాడటానికి కాదురా నాయనా! కిటికీ తెరుచుకోవడం లేదేమిటని అడగడానికి’ విరుచుకుపడింది మహిళ.
మతిమరుపు
ప్రొఫెసర్ తన భార్యతో-
‘నాకు మతి మరుపు అని అంటుంటావుగా… ఈ రోజు నేనేం చేశానో చూడు’ అన్నాడు.
‘ఏం చేశారు?’ ఆసక్తిగా అడిగింది భార్య.
‘బజారుకు వెళ్లేటప్పుడు తోడుగా తీసుకెళ్లిన మన చంటిగాడిని మరచిపోకుండా తిరిగి ఇంటికి తీసుకొచ్చాను’ అన్నాడు ప్రొఫెసర్ గర్వంగా.
‘మీ మతిమరుపు మండా.. అసలు మనకు పిల్లలే లేరు కదండీ…’ అంటూ విరుచుపడింది భార్య.
మేకప్ మహిమ
‘వెల్డన్ మేడమ్! మా మందు మీకు బాగా పనిచేసింది. మీరు రెండు కిలోలు తగ్గారు’ అన్నాడు రిప్రజెంటేటివ్.
‘నీ మొహం!. ఈ రోజు నేను మేకప్ చేయలేదు’ అంది సుందరి.
టాపిక్ డైవర్ట్
‘నాకోసం నువ్వేమైనా చేస్తావా’
‘చేస్తాను’
‘నేను తాగొస్తే గొడవ పడవ్ కదా?’
‘గొడవ పడను’
‘మీ పుట్టింటికి వెళ్లవు కదా?’ ‘వెళ్లను’
‘షాపింగ్ కోసమని చీటికిమాటికి డబ్బులు అడగవు కదా?’
‘అడగను’
‘తిండి సరిగా పెట్టడం లేదని నన్ను తిట్టుకోవు కదా?’
‘తిట్టను’
‘కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదని కోపగించుకోవు కదా?’
‘లేదు’
‘అదే పనిగా సీరియల్స్ చూడ్డం మానేస్తావు కదా?’
‘బాగా అలసిపోయి వచ్చారు.. తిని పడుకోండి’
అల్ప సంతోషి
మల్లేష్‌కు అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికింది. దాన్ని రుద్దాడు. అందులోంచి భూతం ప్రత్యక్షమైంది.
‘ఆజ్ఞపించుము ప్రభు?’ అడిగింది వినియంగా.
‘ఓ పెద్ద బంగ్లా, దాని నిండా ఫర్నీచర్. చుట్టూ అందమైన గార్డెన్. బంగ్లా ఎదుట ఎల్లప్పుడు అందుబాటులో ఉండే ఖరీదైన కార్..’ చెప్పుకుంటూ పోయాడు మల్లేష్.
‘అంతేనా… ఇంకేమైనా కోరికలు ఉన్నాయా?’ అనడిగింది భూతం.
‘ఆ బంగ్లాలో నాకు సెక్యూరిటీగార్డ్ ఉద్యోగం’ అన్నాడు మల్లేష్.
ఉచిత సలహా
డెభై ఐదేళ్ల వ్యక్తి మ్యారేజ్ బ్యూరోకు వెళ్లాడు.
‘నేనో విధవను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు.
‘అలాంటి సంబంధం దొరకడం ఇప్పటికిప్పుడు కష్టం. ముందైతే మీరు పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని కట్టుకున్న ఆవిడ కొన్ని రోజులకే ఆటోమెటిక్‌గా విధవ అయిపోతుంది లేండి’ సలహా ఇచ్చాడు ఏజెంట్.