కమీషన్
సీనియర్ డాక్టర్ : నేను జ్వరానికి మూడు రకాల టాబ్లెట్లు రాస్తే, నువ్వెందుకు ఐదు రకాల టాబ్లెట్లు రాస్తున్నావ్?
జూనియర్ డాక్టర్ : మెడిసిన్‌లపై ముప్పై శాతం కమీషన్ వస్తున్నప్పుడు ఆ మాత్రం మందులు రాయాలనిపించదా చెప్పండి.
నో కన్సెషన్
క్లయింట్ : లాయర్ గారూ… ఒక ప్రశ్నకు ఎంత ఫీజు తీసుకుంటారు?
లాయర్ : ప్రశ్నకు రెండొందలు.
క్లయింట్ : కన్సెషన్ ఏమైనా ఉందా?
లాయర్ : ఏమీ లేదు. ఈ రెండు ప్రశ్నలకు కలిపి నాలుగొందలు ఇవ్వండి.
జీడిపాకం
పొరుగింటావిడ : మీ పాపకు రోజూ ‘వారసులు – వారసత్వం’ సీరియల్ చూపిస్తూ అన్నం పెడుతున్నారెందుకు?
ఇరుగింటావిడ : నేను కూడా చిన్నప్పుడు ఈ సీరియల్ చూసే అన్నం తినేదాన్ని. అందుకే.
నటన
విలేకరి : మీరు సినీరంగం నుండి రాజకీయ రంగానికి వెళ్ళబోతున్నారని అందరూ అనుకుంటున్నారు నిజమేనా?
హీరో : రాజకీయాల్లోకి వెళ్ళాలని గతంలో అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు.
విలేకరి : ఎందుకని?
హీరో : రాజకీయాల్లో నుండి సినీరంగంలోకి వస్తేనే ఈజీగ నటించొచ్చని ఆలస్యంగా తెలిసింది.
డిస్కౌంట్
షాపు యజమాని : మా షాపులో ఏది కొన్నా రెండు రూపాయల డిస్కౌంట్ ఇస్తాం.
కొనే వ్యక్తి : అయితే రెండు రూపాయల షాంపూ ప్యాకెట్ ఇవ్వండి.
ఛాలెంజింగ్ జాబ్
టీచర్ : కిషోర్… నువ్వు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నావ్?
కిషోర్ : డాక్టర్, ఇంజనీరింగ్ లాంటివి కాకుండా ఏదైనా ఛాలెంజింగ్ జాబ్ చేయాలని ఉంది.
టీచర్ : గుడ్… ఇంతకీ ఏ జాబ్ సెలక్ట్ చేసుకుంటున్నావ్?
కిషోర్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్.