నేర విముక్తి ఆసనం
‘బాబా నేనో నేరం చేశాను’
‘ఏం చేశావ్?’
‘అనుకోకుండా ఒకరిని మర్డర్ చేశా’
‘అయితే.. నా దగ్గరికి ఎందుకొచ్చావ్?’
‘మర్డర్ చేసినప్పటి నుంచి నాకు భయంగా ఉంది’
‘ఓహ్ అంతేనా.. దానికో ఆసనం ఉంది’
‘దీంతో టెన్షన్ నుంచి బయట పడొచ్చా?’
‘టెన్షన్ నుంచే కాదు… కేసు నుంచి కూడా బయటపడొచ్చు’
‘ఆశ్చర్యంగా ఉందే! అయితే… త్వరగా చెప్పండి బాబా…’
‘ముందుగా నిటారుగా కూర్చోవాలి. ఆ తర్వాత రెండు కాళ్లు సమానంగా చాపాలి.
శ్వాస లోపలికి తీసుకుంటూ ఓ పది నిమిషాలు కళ్లు మూసుకోవాలి.
ఈ నేరాన్ని ఎవరి మీద తోసేయాలో బాగా ఆలోచించాలి. ఒక నిర్ణయానికొచ్చాక నిదానంగా శ్వాస వదిలిపెట్టాలి’
తెలియకపోవడమే బెటర్
ఓ మల్టీనేషనల్ కంపెనీలో ట్రైనీగా చేరాడు వెంగళప్ప.
ఇంటర్ కం ఫోన్‌ను డయల్ చేసి ‘కాఫీ పంపించు’ అని ఆర్డర్ చేశాడు.
‘నువ్వెరికి ఫోన్ చేశావో తెలుసా?’ అనడిగింది అవతలి గొంతు.
‘తెలుసు.. క్యాంటీన్‌కు ఫోన్ చేశాను’ అన్నాడు వెంగళప్ప.
‘నువ్వు ఫోన్ చేసిందెవరికో కాదురా ఇడియట్… ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌కు’ ఆగ్రహం వ్యక్తం చేశాడు అవతలి వ్యక్తి.
‘నీకు ఫోన్ చేసిందెవరో తెలుసారా ఇడియట్?’ అడిగాడు వెంగళప్ప.
‘తెలియదు’ చెప్పాడు అవతలి వ్యక్తి.
‘థాంక్స్ గాడ్..’ అంటూ ఫోన్ పెట్టేశాడు వెంగళప్ప.