అదంతే…
భార్య : అదేంటి గత సంవత్సరం మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎర్ర గులాబి ఇచ్చారు. ఇప్పుడు తెల్ల గులాబి ఇచ్చారెందుకు?
భర్త : అప్పుడు ప్రేమ కావాలి కాబట్టి ఎర్రగులాబి.. ఇప్పుడు శాంతి కావాలి కాబట్టి తెల్లగులాబి.
ఎంత తీరిక!?
భర్త : హారు డార్లింగ్… ఈ రోజు ఇల్లంతా ఇంత నీట్‌గా సర్దేశావు… నీ మొబైల్లో వాట్సప్ పని చేయలేదా?
భార్య : వాట్సప్ సంగతి దేవుడెరుగు. అసలు సెల్లే కనిపించకపోవడంతో దానికోసం వెతుకుతూ ఇల్లంతా సర్దేశాను.
నిద్ర
భర్త : ఈ రోజు వంట చేయలేదేం..?
భార్య : పడ్డానండీ.. పట్టేసింది..
భర్త : ఎక్కడ పడ్డావు.. ఏం పట్టేసింది..?
భార్య : బెడ్‌పై పడగానే నిద్ర పట్టేసింది.
కుడి ఎడమైతే…
టీచర్ : రవీ… 212లో నుంచి 2 తీస్తే ఎంత?
రవి : కుడివైపు తీస్తే 21, ఎడవైపు తీస్తే 12, రెండువైపులా తీస్తే 1.
ఇంకో ఆప్షన్
భార్య : ఏమండీ… డాక్టర్ గారు నన్ను ఓ నెల విశ్రాంతి తీసుకోడానికి స్విట్జర్లాండ్ కానీ, స్పెయిన్‌కానీ టూర్‌కి వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఎక్కడికి, ఎప్పుడు వెళ్దామో చెప్పండి.
భర్త : రేపే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం.