చివరి కోరిక
జడ్జి : రేపు నిన్ను ఉరి తీస్తారు. నీ చివరి కోరికేమయినా వుంటే కోరుకో.
ఖైదీ : మీరు నా కోరిక తీర్చలేరు జడ్జిగారు.
జడ్జి : ఆ కోరిక ఏదైనా పర్వాలేదు. చెప్పు తీరుస్తాం.
ఖైదీ : అడిగాక తీర్చలేం అంటారండి.
జడ్జి : అనంలేగానీ ముందు నీ కోరికేంటో చెప్పు?
ఖైదీ : బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని వుంది.
తిక్క జవాబు
టింకు : మా చెట్టుకి ఎన్ని జామకాయలున్నాయో చెప్పుకో చూద్దాం.
చిట్టి : కాసిన తర్వాత నువ్వు తినగా, మిగిలినవన్నీ ఉంటాయి.
టింకు : అదేంటి?
చిట్టి : నేనింకా మీ కాయలు కోయలేదుగా అందుకే మరి!
భలే కుక్క
సురేష్ : మా టైగర్ చాలా తెలివైంది తెలుసా?
నరేష్ : ఏంటో దాని గొప్పతనం?
సురేష్ : పొద్దున్నే నాకు పేపర్ తెచ్చిస్తుంది.
నరేష్ : ఇదేమన్నా విశేషమా? అన్ని కుక్కలు చేసే పనేగా?!
సురేష్ :కానీ మేం పేపర్ వేయించుకోంగా.
తిక్క మొగుడు
రాంబాబు : మేం హనీమూన్ వెళ్ళడానికి టాక్సీ మాట్లాడుకున్నప్పుడు ఓ సంఘటన జరిగింది తెలుసా?
సోంబాబు : ఏంటది?
రాంబాబు : మేమిద్దరం వెనక సీట్లో కూర్చున్నామా… టాక్సీ డ్రైవర్ మాటిమాటికీ మా ఆవిడని అద్దంలోంచి చూస్తున్నాడు. నాకు తిక్కరేగింది.
సోంబాబు : ఏం చేశావ్… వాడి చర్మం ఒలిచేశావా?
రాంబాబు : కాదు… వాణ్ణి వెనక సీట్లో కూర్చోమని మేమిద్దరం ముందు కూర్చుని, నేను డ్రైవ్ చేశాను.
మరేం ఫర్వాలేదు
పార్కుకు వచ్చిన తండ్రీకొడుకులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
కొడుకు: నాన్నా… నీ దగ్గర ఉన్న మన ఇంటి తాళం చెవి పోయిందనుకో… అప్పుడెలా?
తండ్రి: మరేం ఫర్వాలేదు. పక్కింట్లో తాళం చెవి ఉంది.
కొడుకు : అదికూడా పోతేనో…?
తండ్రి : అయినా ఫర్వాలేదు. ఇలా మర్చిపోతామనే నేనసలు ఇంటికి తాళం వేయలేదు.