వెక్కిరింపు
భార్య: మీరేమో నేను లావైపోతున్నా అని వెక్కిరిస్తారు కానీ ఇది చూడండి, ఏడేళ్ల నుండి వాడుతున్నా. ఐనా ఇంకా ఎంత చక్కగా సరిపోతుందో.
భర్త: శాలువాని చూపించి ఇప్పటికీ సరిపోయిందంటావేంటే ఖర్మ!
నా ప్రాణం పోతోంది
టింకూ : మమ్మీ ట్యూషన్ నుండి నన్ను తీసుకురావడానికి డాడీని పంపకు. ఇకనుండి నువ్వే రా, లేదంటే నేనె వస్తా.
మమ్మీ : ఎందుకురా
టింకూ : ఆయన్ని మా మిస్ నుంచి లాక్కురావడానికి నా ప్రాణం పోతోంది.
బస్సు దిగగానే
బస్సు కండక్టరు: 12 ఏళ్ల లోపు పిల్లలకే హాఫ్ టిక్కెట్. నీ వయసెంత బుజ్జీ.
పిల్లవాడు: 11 ఏళ్లు.
బస్సు కండక్టరు : మరి 12 ఏళ్లు ఎప్పుడు నిండుతాయి
పిల్లవాడు : బస్సు దిగగానే…
తమన్నా.. మంత్రం
రాజు: దొంగను చూసి దొంగ.. దొంగ అని పిలిచినా ఎవ్వరూ బయటకు రాలేదు.
రాము: అవునా, మరేం చేశావ్
రాజు: తమన్నా… తమన్నా.. అని కేకలు వేశాను. అంతా తలుపులు తీసుకుని బైటకు పరుగులు పెట్టారు. దొంగను పట్టించాను.
పరమ లోభి…
సుందర్ : మా ఆవిడ పరమ లోభి..
రాజు : ఎలా చెప్పగలవు..?
సుందర్ : మాకిద్దరు పిల్లలు కావాలని అనుకుంటున్నాము. వారిద్దరినీ ఒకటే కాన్పులో కనేసి మాకు ఆసుపత్రి ఖర్చు మిగిల్చింది..!
చెడిపోకుండా
రోజా : ఏరా బుజ్జి.. నాన్న పేరును పేపర్ మీద రాసి అలా ఫ్రిజ్‌లో పెట్టావేంటి?
చంటి : నా పేరు చెడిపోకుండా చూసుకోమని నాన్న పదే పదే చెప్తున్నాడమ్మా. ఫ్రిజ్‌లో పెడితే ఏదైనా చాలా రోజులు పాడైపోకుండా వుంటుందని చెప్తారుగా. అందుకే ఫ్రిజ్‌లో పెడుతున్నా.
అందుకే తాగుతున్నా…
భార్య : ఏంటండీ వచ్చిన జీతమంతా నీ తాగుడుకే తగలేస్తున్నారు
భర్త : నువ్వేం తక్కువా… బ్యూటీ పార్లల్‌కు నువ్వు తగలేయడంలా
భార్య : ఎవరికోసం… నీకోసం అందంగా కనిపించేందుకే
భర్త : నువ్వు అందంగా కనపడాలనే నేను మందు కొడుతున్నా
బస్సు దిగగానే
టింకూ: తాతయ్యా మాస్టారు వస్తున్నారు దాక్కో
తాత : ఆయన వస్తే నేను దాక్కోవడం ఎందుకురా.
టింకూ : నువ్వు చచ్చిపోయావని చెప్పి ఇవ్వాళ బడి మానేశాలే.