నవ్వుల్‌ పువ్వుల్‌

ప్రశ్నలు – జవాబులు
తండ్రి:
ఏరా నానీ ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?
నాని: యాభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి.
తండ్రి: మరి నువ్వెన్ని ప్రశ్నలకు జవాబులు రాశావు?
నాని: పైన రెండు, కింద మూడు ప్రశ్నలకు తప్ప అన్నిటికీ రాశాను.
స్వర్గం అంటే
భార్య : ఏమండీ… పక్కింటి పంకజం చెప్పింది, గుళ్ళో స్వాముల వారు చెప్పారట… భార్యాభర్తలు స్వర్గంలో కలిసుండటానికి వీలుండదంట.
భర్త: అందుకే కదా మరి దాన్ని స్వర్గం అనేది.

ఉత్తుత్తిదే
దొంగ:
నీ పర్స్‌ ఇవ్వు. లేకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా.
సుబ్బారావు: ఇదిగో తీసుకో…
దొంగ: పిచ్చివాడా! ఈ తుపాకీలో గుళ్ళు లేవు
సుబ్బారావు: వెర్రివాడా! నా పర్సులో కూడా డబ్బుల్లేవు.