నవ్వుల్‌ పువ్వుల్‌

laugh flowersఓ చిన్న మాట

కాలేజీ జీవితం జియో లాంటిది : ప్రపంచం మీ చేతుల్లో
బ్యాచిలర్‌ జీవితం ఎయిర్‌ టెల్‌ లాంటిది : ఇంత స్వేచ్ఛ ఇంకెక్కడీ
ఎంగేజ్‌మెంట్‌కు ముందు ఐడియా : మీ జీవితాన్నే మార్చేస్తుంది.
పెళ్ళయ్యాక వొడాఫోన్‌ : ఎక్కడైనా నెట్‌వర్క్‌ ఫాలో అవుతుంది.
పిల్లలు పుట్టాక బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. : అన్ని లైన్లూ బిజీగా ఉంటాయి.
కానీ… స్నేహం ఎల్‌.ఐ.సీ లాంటిది : జీవితంతో పాటు, జీవితాంతం కూడా.
అమ్మాయి – అబ్బాయి

అమ్మాయి : నేను నిన్న రాఖీ తెస్తే, ఎందుకు కట్టించుకోకుండానే వెళ్ళిపోయావు?
అబ్బాయి : ఇది మరీ బాగుంది… రేపు నేను తాళి తెస్తాను, కట్టించుకుంటావా?
కన్‌ఫ్యూజన్‌ మాస్టర్‌

టీచర్‌ : ఏబీసీడీలు వరుసగా చెప్పు?
విద్యార్థి : క్యాపిటల్‌ లెటర్సా, స్మాల్‌ లెటర్సా టీచర్‌.
తాన – తందాన
భార్య : ఎప్పుడైనా నేను చెప్పిందానికి సరే అన్నారా అసలు?
భర్త : నువ్వోసారి కోపమొచ్చి చస్తానంటే సరే అన్లేదా?
పనిష్మెంట్‌

రాజేష్‌ : డబ్బుల్లేకుండా చైనీస్‌ హోటల్‌కి వెళ్ళి టిఫిన్‌ చేయడం పొరపాటైపోయింది.
సురేష్‌ : ఏం జరిగింది?
రాజేష్‌ : ఇరవై పాముల్ని నా ముందు పడేసి వాటి చర్మం వలవమన్నారు.
కారణం
కష్టమర్‌ : పావుకిలో హల్వా పార్శిల్‌ చేస్తే ఐదొందలా?
షాపు యజమాని : త్రాసులోనుండి హల్వా బయటికి రాలేదు సార్‌. అందుకే దాన్ని కూడా కలిపి పార్శిల్‌ చేశా.
యాక్సిడెంట్‌ కాకుండా

భార్య : మీకేమైనా పిచ్చెక్కిందా? ఏంటా స్పీడు? స్కూటర్‌ స్పీడు కాస్త తగ్గించండి.
భర్త : పిచ్చిమొద్దూ, బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. యాక్సిడెంట్‌ కాకుండా ఇంటికి చేరుకోవాలనే అంత స్పీడుగా తీసుకెళ్తున్నాను.