పని చేస్తే తప్పేంది?
మాంచి నిద్రలో ఉన్న వెంగళప్పను అతని భార్య మంగమ్మ నిద్రలేపి, కాఫీ పెట్టమని ఆర్డర్ వేసింది. దీంతో వెంగళప్ప కోపంగా బయటకు వెళ్లి ”ఇక నీతో వేగలేను” అంటూ చెప్పులు వేసుకున్నాడు.
”ఎక్కడికి వెళ్తున్నారో కాస్త చెప్పి చావండి” అంది మంగమ్మ.
”లాయర్ దగ్గరకు వెళ్తున్నా.. నీకు విడాకులిచ్చేస్తా” అని చెప్పాడు వెంగళప్ప.
ఓ గంట తర్వాత వెంగళప్ప పిల్లిలా వచ్చి, వంట గదిలోకి వెళ్లి కాఫీ పెట్టి ఇచ్చాడు.
”ఏమైందీ? విడాకులిస్తానన్నారుగా?” అంది మంగమ్మ.
”నేను వెళ్లేసరికి లాయర్ అంట్లు తోముతున్నాడు” అని గొణుకున్నాడు వెంగళప్ప.
ఎంత బాగుందో…!
ఫ్లైట్‌లో ఓ అందమైన అమ్మాయి పక్కన ఓ వ్యక్తి ఆమెని ”మీరు ఉపయోగించిన పెర్‌ఫ్యూమ్ స్మెల్ చాలా బాగుంది. దాని పేరు చెప్తే నేనూ కొంటాను” అని అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం… ”అయ్యో అలా చేయకండి… కొంతమంది ఇడియట్స్ ఈ వంక పెట్టి ఆమెతో మాట్లాడాలని చూస్తారు” అంది.
ఈ మాటతో ఆ వ్యక్తి ముఖం ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాలా?!