లీకేజ్ ఎక్కడినుంచి
పెద్ద ఐస్‌ముక్కను చేతిలో పట్టుకొని పరిశీలనగా చూస్తున్నాడు వెంగళప్ప
సుబ్బారావు : ఏమిటి అంత పరిశీలించి చూస్తున్నావ్?
వెంగళప్ప : నీళ్ళు ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయా అని!
కోడికో పన్ను
దానయ్య : నీ పన్ను ఎలా ఊడింది?
రాజయ్య : కోడికూర తిన్నందుకు
దానయ్య : కోడికూర తింటే ఎక్కడైనా పన్ను వూడుతుందా?
రాజయ్య : నేను తిన్నది పక్కింటివాడి కోడిని, వాడు కొట్టిన దెబ్బలకు పన్ను వూడింది.
ఎగ్జామ్ ప్రిపేరింగ్
తండ్రి : ఎగ్జామ్స్ రేపటి నుంచి మొదలవుతాయి కదా… బాగా ప్రిపేర్ అయ్యావా?
చిన్ను : బాగా ప్రిపేర్ అయ్యా డాడీ! ఎగ్జామ్ పాడ్ కొత్తది కొని దానికి హాల్ టికెట్ అతికించుకున్నా, పెన్నులో కొత్త రీఫిల్ వేశా, పెన్సిల్ చెక్కుకున్నా, బట్టలు కూడా ఇస్త్రీ చేయించుకున్నా, పరీక్ష హాల్లో నిద్ర రాకూడదని రాత్రంతా హాయిగా నిద్ర పోయా.
చాలా ఇష్టమని
మామ : పుణ్య క్షేత్రానికి అమ్మాయితో వెళ్ళి మీరొక్కరే తిరిగి వచ్చారు. అమ్మాయి ఏదండీ?
అల్లుడు : కాశీకి వెళ్లాం కదండీ… అక్కడ బాగా ఇష్టమైనవి వదిలి రావాలంటేనూ నా కెంతో ఇష్టమైన మీ అమ్మాయిని అక్కడే వదిలి వచ్చా.
ఊరెళ్తే సరి
ఆనందం: పెళ్ళయిన మగాడికి విశ్రాంతి లేదా!
పరమానందం : ఎవరు చెప్పారు విశ్రాంతి లేదని. సమస్య ఉంటే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. పెళ్ళాం ఊరెళ్ళిన ప్రతీసారీ మగాడికి విశ్రాంతే నాయనా..!
ఆనందం:పెళ్ళాం ఎక్కడికీ వెళ్లకపోతే!
పరమానందం : నువ్వు ఊరెళ్ళు. ఏ గొడవా ఉండదు.
గండం నుండి గట్టెక్కాలంటే
భార్య : ఏవండోరు పూజలు చేస్తే ఎలాంటి గండాలూ ఉండవంట.
భర్త : నిజమా… మీ నాన్న ఏ పూజలు చేసి నీ గండం నుంచి గట్టెక్కాడో చెప్పు.
వందకు పైనే
నాన్న : ఏరా లెక్కల్లో మార్కులు వందకు పైగా వచ్చాయన్నావు? మరి రెండు మార్కులే వచ్చాయి ఎంట్రా?
చంటి: అవును నాన్నా! ఆ రెండు ఎక్కడ వేశారో చూడు, వందకు పైనే కదా!
పండగే పండగ
రామారావు : స్వీట్లు ఎందుకు పంచుతున్నావు.?
ప్రమోషన్ ఏమైనా వచ్చిందా?
సుబ్బారావు : లేదు, నా భార్య పదేళ్ళుగా చూస్తున్న సీరియల్ అయిపోయింది.
వెయ్యా? ఐదొందలా?
రమేష్ : ఓరేరు రాము… వెళ్లే దారిలో ఒక పక్క 1000నోటు, మరో పక్క 500 నోటు కనిపిస్తే నువ్వు దేన్ని తీసుకుంటావ్.
రాము : నేను పిచ్చోడిని అనుకుంటున్నావా ఏంటి.. తప్పకుండా 1000 నోటునే తీసుకుంటా.
రమేష్ : నువ్వు నిజంగా పిచ్చోడివే. ఎవరైనా రెండు నోట్లు తీసుకుంటారు తెలుసా…
మందుకి తగ్గ రోగం
సుచిత్ర : డాక్టర్ గారు ఉదయం ఇంట్లో చిన్న గొడవైంది.
మా వారు నిద్రమాత్రలనుకొని ఓ ముప్పై ఒళ్ళు నెప్పుల మాత్రల్ని మింగేశారు. ఏమన్నా అవుతుందంటారా.
డాక్టర్ : ఏంటీ… ఒళ్ళునొప్పుల మాత్రలు మింగాడా?
అయితే ఓ పని చేయండి ఒళ్ళంతా పుండయ్యేలా విరగొట్టండి.
అన్ని మాత్రలకు ఆ మాత్రం దెబ్బలు అవసరం.