బహుమతి
తల్లి: బన్నీ బయటికి వెళ్లున్నా…నీ కోసం ఏం తీసుకురమ్మంటావ్..
కొడుకు: క్యూట్ గా ఉండే కోడల్ని తీసుకురామ్మ…
నమ్మక ద్రోహం
టీచర్ : 15 నిమిషాల్లో పరీక్ష నుంచి లేచి వెళ్లిపోతున్నావేంటి.. పేపర్ అర్థం కాలేదా ?
స్టూడెంట్ : లేదు మేడం.. ఎవరినైతే నేను నమ్ముకొని వచ్చానో తానే నన్ను అడుగుతున్నాడు.. అందుకే ఇలా
తేడా ఏంటో…!
భర్త నుంచి 5 మిస్డ్ కాల్స్ వస్తే ఏ జరిగిందో అని భార్యలో కలవరం. అదే భార్య నుంచి వస్తే ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భర్త భయం.
మోకాళ్ళ లోతు
రాము : రమేష్ నువ్వే చెప్పావు కదా.. నీళ్లు మోకాళ్ల వరకే ఉన్నాయని.. కానీ దిగితే అర్థమైంది మునిగిపోయేంత ఉన్నాయని.. ఎందుకలా చెప్పావ్..
రమేష్ : నేను ఉదయం చూసినప్పుడు నీళ్లలోంచి బాతులు వెళ్లాయి.. నీరు వాటికి మెకాళ్ల వరకే వచ్చారు మరి!
ఎంత మాట!?
తండ్రి : ఆ రోజుల్లో వంద రూపాయలు జేబులో పెట్టుకొని సరుకులు, పాలు, కూరగాయలు ఇలా ఒకటేంటి అన్ని తెచ్చే వాడిని తెలుసా ?
కొడుకు : నాన్న అప్పట్లో సిసి కెమెరాలు లేన్నట్లుగా ఉంది..ఇప్పుడు అడుగడుగునా అవే ఉన్నారు..