సింహం మాదిరి
ఉద్యోగి : సార్… మీరు ఆఫీసులో మాదిరిగానే ఇంట్లో కూడా సింహంలాగానే వుంటారా?
ఆఫీసర్ : యూ.. స్టుపిడ్! సింహం ఎక్కడైనా సింహమే. కాకాపోతే ఇంటి దగ్గర సింహం మీద కనకదుర్గ అమ్మవారు వుంటారు. ఆమె వాహనం సింహమే కదా.
తాతయ్య కళ్లజోడు
తండ్రి : నువ్వు ఈ మధ్య సరిగా చదవడం లేదురా. స్కూల్ నుండి ఫోన్ కూడా వచ్చింది మీ అబ్బాయి సరిగా చదవడం లేదని.
కొడుకు : తాతయ్యని కళ్లజోడు ఇవ్వమని చెప్పు. చదువుతా.
తండ్రి : తాతయ్య కళ్లజోడు నీకెందుకురా.
కొడుకు : కళ్లజోడు పెట్టుకున్నప్పటి నుండి తాతయ్య బాగా పేపర్ చదువుతున్నాడు. ఆ కళ్లజోడు ఇస్తే తాతలాగే నేనూ బాగా చదువుతా.
అందుకే, రోజూ రావాలి
మహేష్: ‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మేడమ్!’
టీచర్: అందుకేరా స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్‌ని..!
వాళ్ళు డబ్బున్నోళ్లు
సుందరి : రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!
రోజా : వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!