
– నిరసనగా ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో స్మిత సబర్వాల్ దిష్టిబొమ్మ దగ్ధం
– విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వికలాంగుల శక్తిసామర్థల మీద చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, వికలాంగులకు స్మిత సబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్, విహెచ్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన స్మిత సబర్వాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యావంశి హాజరయ్యారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ గారు మాట్లాడుతూ.. ఈ నెల 21 నాడు ఎక్స్ అనే సోషల్ మీడియా వేదికగా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వికలాంగులకు సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్లు ఎందుకు అని సివిల్ సర్వీసెస్ లో పని చేసే వారు క్షేత్ర స్థాయిలో పని చేయగలరా అని, అలా పని చేసే శక్తి సామర్థ్యాలు వికలాంగులకు ఉండవు అని అనుచిత వాఖ్యలు చేసింది. ఈ వాక్యాలకు నిరసనగా విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మ దగ్ధం దహనం చేయడం జరిగిందన్నారు. ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ.. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వికలాంగుల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక ఐఏఎస్ అధికారి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతుంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, వెంటనే స్మిత సబర్వాల్ ని విధుల నుంచి తప్పించాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో ఎం ఎస్ పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికెల్ల పోశెట్టి మాదిగ, ఎం ఎస్ పి జాతీయ నాయకులు మానికొల్ల గంగాధర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, సత్తెక్క మాదిగ, ఎం ఎస్ పి జిల్లా నాయకులు మంద ప్రభాకర్ మాదిగ, విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బీరప్ప, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ, సావిత్రి, లావణ్య, ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నాగం ప్రదీప్ మాదిగ, ఎం ఆర్ పి ఎస్ నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఎం ఎస్ పి జిల్లా నాయకులు యధసి శ్రీరాములు మాదిగ, గాజుల రాంచందర్ మాదిగ, శేఖర్ మాదిగ, కదేశి నవీన్ మాదిగ, శీలం యాదగిరి మాదిగ, ఎం ఎస్ పి బీసీ సెల్ నాయకులు సూర్య అశోక్ వడ్డెర, ఎమ్మార్పీఎస్ బోధర్ అర్బన్ మండల అధ్యక్షులు అబ్బయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు కళ్యాణ్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు కనక శ్రీడీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.