– రాష్ట్రంలో మరోసారీ భారీగా ఐఏఎస్‌లకు స్థానచలనం
– సీఎం సంయుక్త కార్యదర్శిగా సంగీతా సత్యనారాయణ
– నీటి పారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా : ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరోసారీ పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటికే పలువురు అధికారులకు ప్రమోషన్లు, కీలక శాఖలు కేటాయించిన సర్కార్ తాజాగా కొంత మందిని బదిలీ చేయగా, మరి కొంత మందికి అదనపు బాద్యతలు అప్పగించింది. పలు శాఖల కార్యదర్శులతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి స్మితా సబ ర్వాల్‌ను ప్రాధాన్యతలేని టీఎస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్య కార్యదర్శిగా బదిలీచేసింది. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కుమార్తె, ఐఏఎస్ అధికారి ఎస్.సంగీత సీఎం సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవలే జీఏడీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ రాహుల్ బొజ్జను కీలకమైన ఇరిగేషన్ కార్యదర్శిగా నియమించింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్‌గా ఉన్న మహేష్ దత్ ఎక్కాను గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా, కార్మికశాఖ కమిషనర్‌గా ఉన్న అహ్మద్ నదీమ్‌ను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్‌ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శిగా ఉన్న కృష్ణ ఆదిత్యను కార్మిక శాఖ డైరెక్టర్‌గా, పంచాయతి రాజ్ రూరల్ డెవలప్ మెంట్ కార్యదర్శిగా ఉన్న ఆయేషా మస్రత్ ఖనమ్‌ను మైనార్టీ గురుకులాల కార్యదర్శిగా, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా భారతి హోలికేరి, ఆయుష్ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతిలను ప్రభుత్వం బదిలీ చేసింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప ్‌కుమార్ సుల్తానియాకు మిషన్ భగీరధ కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు జీఏడీ కార్యదర్శిగా, రవాణాశాఖ కమిషనర్ డాక్టర్‌జ్యోతి బుద్దప్రకాశ్‌కు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా, ఉప ముఖ్యమంత్రి ఓఎస్‌డీ కృష్ణ భాస్కర్‌కు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు టీఎస్‌ఎంఎస్ ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరితకు కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిం చింది. పోస్టింగ్ కోసం ఎదరు చూస్తున్న డి.దివ్యను పురపాలక శాఖ డైరెక్టర్, ప్రజావాణి రాష్ట్రస్థాయి నోడల్ అధికారిగా, చిట్టెం లక్ష్మిని డైరీ డెవలెప్‌మెంట్ కార్పోరేషన్ ఎండిగా, దాసరి హరిచందనను నల్గొండ కలెక్టర్‌గా నియమించారు. మహబూబాబాద్ కలెక్టర్ కె. శశాంకను రంగారెడ్డి కలెక్టర్‌గా, సెంట్రల్ డిప్యు టేషన్ ముగించుకొని రాష్ట్ర సర్వీసులకు వచ్చిన అద్వైత్ కుమార్ సింగ్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా, గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతిని సంగారెడ్డి కలెక్టర్‌గా, జయశంకర్ భూపాలపల్లి అడిషినల్ కలెక్టర్ పి కదిరవన్‌ను హైదరాబాద్ జిల్లా అడిషినల్ కలెక్టర్‌గా, గద్వాల కలెక్టర్‌గా బిఎం సంతోష్‌ను ప్రభుత్వం బదిలీచేసింది. అటవీ అభివృద్ధి కార్పోరేషన్ ఎండీ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి డా.చంద్రశేఖర్ రెడ్డిని సిఎం కార్యదర్శిగా, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల జాయింట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులును సీఎం ఒఎస్డిగా నియమిస్తూ సిఎస్ శాంతికుమారి బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.