
– జాగ్రత్తగా, నిదానంగా వెళ్ళాలని ఎస్ ఐ సూచనలు
నవతెలంగాణ – పెద్దవూర
రహదారులను పొగ మంచు కమ్మేస్తున్నది. శనివారం ఉదయం నాగార్జున సాగర్, హైదరాబాద్ జాతీయ రహదారి పైన, పెద్దవూర మండలంలో తెల్ల వారుజామున నుంచే పొగ మంచు కమ్మేయడం వలన వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రయాణం కష్టంగా మారింది. మంచు తెరను చీల్చుకొని వాహనదారులు రోడ్డుపైన ప్రయాణం చేయడం ప్రమాదంతో కూడిందని వాహనదారులు అంటున్నారు. వర్షాన్ని తలపించే విధంగా మంచు ఏర్పడింది. 10 గంటల వరకు కూడా మంచు కమ్ముకొని ఉంది. ప్రధాన రహదారుల గుండా మంచు కమ్మేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా గ్రామీణ రహదారులు ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు, ప్రయాణికులు చూచిపోవలసిన అవసరం ఎంతైనా ఉంది మండల కేంద్రంలో ప్రధాన రహదారి గుండా పోయే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాలలో పొగ మంచు ఇండ్లను సైతం కమ్మి వేసినది. ప్రమాదాలు జరుగకుండా వాహనదారులు పొగ మంచు విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని రోడ్డుపై ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, లైట్లు హారన్ వేసుకుంటూ నెమ్మదిగా ప్రయాణం చేయాలని స్థానిక ఎస్ ఐ వీరబాబు సూచించారు.