– ఇర్కోడ్ పోస్ట్ ఆఫీస్‌లో ధూమపానం చేస్తున్న ఎస్‌పి ఎం
– అవస్థలు పడుతున్న వినియోగదారులు
– ప్రభుత్వ అధికారే ధూమపానం చేయడం చట్ట విరుద్ధం
– చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం
నవతెలంగాణ-సిద్దిపేట రూరల్
పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో సిగరెట్ ధూమపానం చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా ఇది వాస్తవమే సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ పి ఎం కమలాకర్ డ్యూటీ టైంలో నేరుగా సిగరెట్ తాగుతూ విధులు నిర్వహించడంపై పోస్ట్ ఆఫీస్ చెందిన వినియోగదారులు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. రోజువారీగా పోస్ట్ ఆఫీస్ కార్యానికి వస్తున్న ఎస్‌పి ఎం కమలాకర్ విధులు నిర్వహించే సమయంలో కార్యాలయంలో ఉంటూనే ధూమపానం తాగుతున్నాడు. దీంతో కార్యాలయం అంతా ధూమపానం వాసనతో నిండిపోవడంతో కార్యాలయానికి వెళ్లే ఖాతాదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన అధికారి ఇలా ఇష్ట రీతిగా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడం ఏంటని కార్యాలానికి వచ్చేవారు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారి అంటే మంచి లక్షణం గుణం కలిగి, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని ప్రజలకు విశ్వాసం. కానీ ఎస్ పి ఎం కమలాకర్ వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తూ దర్జాగా కుర్చీలో కూర్చొని సిగరెట్ కాల్చుతూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు జన సంచార స్థలాలలో వాళ్లు పోస్టులతో వాటిని పొగ తాగడం మద్యం సేవించడం హానికరమని సూచనలు చేస్తుంది. అన్ని తెలిసినా ప్రభుత్వ అధికారి కార్యాలయంలో సిగరెట్ తాగడం ఏంటని ప్రజలు అవాక్కైతున్నారు. ఈ విషయంపై ఎస్పీఎం కమలాకర్‌ను వివరణ కోరగా ఇది చిన్న విషయమని దీని ఎందుకు భూతాబ్దంతో పెట్టి చూస్తున్నారని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటన పునరావతం కాకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.