తుమ్మల వర్గం భేటీ..

నవతెలంగాణ – ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు కూసుమంచి మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తుమ్మల వర్గం ముఖ్య నేతలు ఆయన కుమారుడు యుగంధర్, సాధు రమేష్ రెడ్డి హాజరయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు రేపు జిల్లాకు రానున్నారని, ఈ సందర్భంగా భారీగా కార్ల ర్యాలీ తీయాలని చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు, భవిష్యత్తు కార్యాచరణపై తుమ్మలతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.