నవతెలంగాణ-కీసర
కీసర మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో 10 గ్రామాల్లో జరిగిన పనులపై సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరం సమావేశం నిర్వహించారు. కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డీఆర్‌డీవో సాంభశివరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బెస్త వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో సాంభశివరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంపై గ్రామసభలో వచ్చిన అభ్యంతరాలను ఓపెన్ ఫోరంలో చదివి వినిపించారు. గ్రామాల్లో రికార్డులు, క్షేత్ర స్థాయిలో పనులను గ్రామసభలు నిర్వహించి ఓపెన్ ఫోరం మీటింగ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కీసర ఎంపీడీవో గ్యామ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, డీఆర్‌డీవో అధికారి గోపాలకష్ణ, ఎంపీటీసీలు నారాయణ శర్మ, వెంకట్ రెడ్డి, ఏపీవో అర్పిత, కాశన్న, జైపాల్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.