నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో డిల్లీలో చేపట్టే సామాజిక చైతన్య దీక్షలను మాలలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల అధ్యక్షులు బూరుగు కిష్టస్వామి, యాస శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఆగస్టు 7, 8, 9 తేదీలలో ఢిల్లీలో జరిగే సామాజిక చైతన్య దీక్షల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలల పలు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో సామాజిక చైతన్య దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ దీక్షలకు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ ,జాతీయ సామాజిక ఉద్యమ నేతలు హాజరు కానున్నాట్లు పేర్కొన్నారు. దీక్షలలో కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా నుండి మాలలు దళిత గిరిజన బహుజన సంఘాలు మేధావులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బందేల హరీష్ బాబు, నోముల బాలయ్య, జెల్ల రమేష్ ,బోజు రమేష్, జాల శ్రీనివాస్, సంపత్, గడిపే బాలు, లావుడ్య బీక్య నాయక్ వేణు, సారయ్య తదితరులు పాల్గొన్నారు.