‘నవతెలంగాణ’ దినపత్రిక తో సామాజిక చైతన్యం

– తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎస్సై రాజు

నవతెలంగాణ- పెద్దవంగర
నవతెలంగాణ దినపత్రిక తో సమాజంలో సామాజిక చైతన్యం వెల్లివిరుస్తుందని తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎస్సై రాజు అన్నారు. నవతెలంగాణ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల కేంద్రంలో వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో దినపత్రికలో నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. నవతెలంగాణ దినపత్రిక ప్రజలు, కార్మికులు, కర్షకుల పక్షాన నిలబడుతుందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతుందని పేర్కొన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన నవతెలంగాణ దినపత్రిక పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిర్విరియామంగా కృషి చేస్తుందని కొనియాడారు. ప్రజాస్వామ్య పాలనలో పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా పత్రికలు యదార్థ ప్రత్యేక కథనాలు రాయాలని సూచించారు. ప్రభుత్వానికి సూచనలు చేయడంలో పత్రికలు ‘కీలకంగా’ వ్యవహరిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై కుమారస్వామి, ఆర్ఐ భూక్యా లష్కర్, సీనియర్ జర్నలిస్ట్ రంగు లక్ష్మణ్, నవతెలంగాణ విలేకరి సుంకరి ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.